11 July, 2026 | 7:07 PM

Breaking News

ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •   ప్రపంచ జనాభా దినోత్సవం, సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ   •  

నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు

11-07-2026 05:57 PM

నందిగామ to నర్సప్పగూడ బిటి డబుల్ రోడ్డుకు 7.30 కోట్లు

లాల్పహాడ్ నుండి చౌదర్ గూడా వరకు బిటి డబుల్ రోడ్డుకు 7.50 కోట్లు

ఉమ్మడి కొందుర్గు మండలానికి 15 కోట్ల నిధులు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,(విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ నుండి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరించారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటివరకు హెచ్ఎండిఏ నుండి 100 కోట్ల వరకు నిధులు తీసుకువచ్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ కు పెద్ద ఎత్తున నిధులు హెచ్ఎండిఏ నుండి వచ్చాయని తెలిపారు.

నందిగామ మండల కేంద్రం నుండి నర్సప్పగూడ గ్రామం వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మించేందుకు హెచ్ఎండిఏ నుండి 7.30 కోట్లు, జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని లాల్ పహాడ్ నుండి చౌదరిగూడ వరకు బిటి డబుల్ రోడ్డు నిర్మాణానికి 7.50 కోట్లు, నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న తాసిల్దార్ భవన నిర్మాణానికి 2.25 కోట్లు, నందిగామ మండలంలో హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించేందుకుగాను హెచ్ఎండిఏ నుండి 10 కోట్లు, కొందుర్గు మండలంలోని హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు గాను హెచ్ఎండిఏ నుండి 15 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. వాటితోనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు.

నందిగామ,  జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పూర్తిచేసి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం మండలాలను ఏర్పాటు చేశారే తప్ప సొంతభవనాలు సమకూర్చలేదని మండిపడ్డారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు పరిపాలన అందించేందుకుగాను అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లేడు చౌదరిగుడా మండలంలో ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, గ్రంథాలయ లకు భవనాల నిర్మాణాలకు హెచ్ఎండిఏ నుండి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. త్వరలోనే మరికొన్ని నిధులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చేగురు ఉపసర్పంచ్ శివశంకర్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. 

స్వచ్ఛమైన ఓటర్లతో జాబితాను సిద్ధం చేయాలి

బోగస్ ఓట్లను తొలగించడంతోపాటు స్వచ్ఛమైన ఓటర్లతో జాబితాను తయారు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రోగ్రాం డివిజన్ లోని 6 మండలాల్లో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బూతు స్థాయిలో బిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు, సూపర్వైజర్లు సమ్మర్ధవంతంగా పనిచేయాలని సూచించారు.

ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లాంటి బోగస్ ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డివిజన్ లోని ఫరూక్ నగర్ మండల చౌలపల్లి, నందిగామ మండలంలోని మజీద్ మామిడిపల్లి, మొదల్ల గూడ, నందిగామ మండల కేంద్రం, కొత్తూరు మండల కేంద్రంలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, వీటన్నిటిని తొలగించేందుకు అధికారులు నాయకులు సహకరించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బోగస్ ఓట్ల నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఇందుకు అన్ని వర్గాల ప్రజలందరూ సహకరించాలని కోరారు.