1 June, 2026 | 9:56 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల

01-06-2026 09:25 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం BD వర్కర్స్ కాలనీలో,బీర్కూర్ మండలం రైతునగర్  గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా జూన్ నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందేలా చూడాలని పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారించాలని సూచించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తూ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయిన లబ్ధిదారులచే వెంటనే గృహప్రవేశం చేయించాలని తెలిపారు.ఏదైనా సమస్యలచే ఇళ్లు మంజూరు అయి ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే లబ్ధిదారులచే సంప్రదింపులు జరిపి త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.