ఉత్తమ పోలీసులకు పతకాలు
02-06-2026 12:00 AM
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసులు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. టీఎస్ జెన్‌కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజుకు శౌర్య పతకం ప్రకటించింది.
ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సంపత్, గ్రేహౌండ్స్‌లోని మరో ఏడుగురి శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మంది ఉత్తమ సేవా పతకాలు, 50 మందికి కఠిన సేవా పతకాలు, మరో 461 మందికి సేవా పతకాలు అందుకోనున్నారు.






