26 April, 2026 | 7:26 AM

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

26-06-2024 01:51 AM

ఎల్బీనగర్, జూన్ 25 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పనులన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా నాలాల్లో పూడికతీత, డ్రైనేజీ నిర్మాణాలు, సీసీడ్రైన్ పను లను త్వరగా పూర్తి చేసి, ముంపు ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గతంలో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ, బాక్స్ డ్రైన్లు, ట్రంక్ లైన్లు, నాలాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ముంపు ప్రాంతా ల్లో వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు. వరద సమస్యలు రాకుండా మూసీనది ప్రాంతాల్లో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అధికారులు రమేశ్‌బాబు, దామెదర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.