పోలీస్ స్టేషన్ పక్కనే చోరీ
షాపులో పది తులాల బంగారం, నగదు అపహరణ
పాపన్నపేట జూన్ 25: పోలీస్ స్టేషన్ పక్కనే దొంగలు పడ్డారు. దొరికినంత దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేటకు చెందిన వ్యాపారి కూకట్ల దుర్గాప్రసాద్ పోలీస్ స్టేషన్ పక్కనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూలాగానే సోమవారం రాత్రి వ్యాపారి షాపునకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం షాపు తెరిచి చూసి లాకర్‌లో దాచి ఉంచిన 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణకు గురయ్యాని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని జాగిలాలు, క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో లభించిన గడ్డపార, హియర్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గడ్డపారతో గోడ బద్ధలు కొట్టి దుండగులు షాపులోకి ప్రవేశించారని గుర్తించారు. కేసును ఛేదించేందుకు విచారణను వేగవంతం చేశారు.






