16 May, 2026 | 10:27 PM

ట్రాఫిక్ క్రమబద్దికరణకు ప్రతి ఒక్కరు సహకరించాలి

16-05-2026 09:22 PM

* ఫుట్ఫాత్ అక్రమణలపై ఎమ్మెల్యే స్పెషల్ డ్రైవ్ 

మిర్యాలగూడ,(విజయక్రాంతి): పట్టణ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఎమ్మెల్యే  స్వయంగా పర్యటించి రోడ్డు విస్తరణ, పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్ లపై వారికి కీలక సూచనలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్ మాట్లాడుతూ రోడ్డుకిరువైపులా  ఫుట్‌పాత్‌లపై కస్టమర్లు వాహనాలు నిలపకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారస్తులదేనన్నారు. కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సాగర్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పనులు నాణ్యతతో  వేగంగా పూర్తి చేయాలన్నారు. వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని, అవసరమైనచోట యూ టర్న్ లు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే, ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా  తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారుల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా బాలు, వైస్ చైర్మన్ శిరీష నవీన్, కమిషనర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ జెట్టి సోమ నరసయ్య,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు దైద సొంసుందర్, ఆడోతు అశోక్ నాయక్, బంటు శ్రీనివాస్, ఆంగోతు శక్రి నాయక్, అవుట శ్రీనివాస్, ఎస్సైలు రాంబాబు,కృష్ణయ్య, శ్రీకాంత్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ చల్లా శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.