14-02-2026 03:12:40 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహరాజ్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా శనివారం SR నగర్ లోని బాపూనగర్ కమిటీ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటం వద్ద పూలు ఉంచి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ బోధించిన సత్యం, ధర్మం, అహింసా మార్గంలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు. బంజారాల ఐక్యత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తు చేశారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బాపూ నగర్ అధ్యక్షుడు హరిసింగ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కూతురు నర్సింహ, కట్టా బలరాం, లక్ష్మీ, రాణి కౌర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.