బస్టాండ్ నిర్వహణపై ఎమ్మెల్యే అసంతృప్తి
కాగజ్‌నగర్, మార్చి 2 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేవన్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఎమ్మె ల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి బస్టాండ్, పరిసరాలను తని ఖీ చేశారు.ఈ సందర్భంగా దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలు, టాయిలెట్లు, పారిశుధ్యం లేని బస్టాం డ్ ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులను మందలించారు.
వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. బస్టాండ్ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేస్తే నిధులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. స్వర్గీయ పాల్వాయి పురుషోత్తం రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ బస్టాండ్లో ఇప్పటివరకు కనీస మరమ్మత్తులు, అదనపు వసతులు కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆర్టీసీ కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంజనేయులతో మాట్లాడతామని తెలిపారు.




