పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చిన డిప్యూటీ సీఎం
కుమ్మరులకు పరికరాలు అందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, ఏప్రిల్ ౧9 (విజయక్రాంతి): పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో నాటి సిఎల్పీ నాయకు లు నేటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమ్మరి తాండా వాసులకు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేర్చారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూరు మం డలం కుమ్మరి తండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 4 లక్షల 53 వేల విలువ గల మెషినరీ, మట్టి కోసం రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక వారి జీవనోపాధి కొరకై ఉపయోగపడే పరికరాలు అందిస్తామని మాట ఇచ్చారని అన్నారు. అలాగే కుమ్మరి తాండా లో రూ. 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చామని కుమ్మరి తండాలో 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం పైన విష ప్రచారం చేసే బిఆర్‌ఎస్ నాయకులను 10 ఏళ్లలో ఏమి ఇచ్చారో ప్రజలు వారిని ప్రశ్నించాలనీ అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను గుర్తించి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






