19 August, 2026 | 3:10 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

రాష్ట్రంలో అభివృద్ధ్ది కుంటుపడింది

20-04-2026 12:32 AM

చెన్నూర్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎంఎల్‌ఏ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం చెన్నూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికల సందర్భంగా ఆయన మాట్లాడారు.

చెన్నూర్ నియోజక వర్గంలో అయితే అభివృద్ది జాడే మరచినట్లయిందని మంత్రి వివేక్ రైతాంగ, మహిళల సమన్యలు, సింగరేణి కార్మికులకు చేయాల్సిన పనులను, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లాంటివాటిని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విఫలంతోనే నాయకులు బీఆర్‌ఎస్ బాట పడుతున్నారన్నారు. ప్రజలందరు కేసీఆర్ ప్రభుత్వం రాక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అనంతరం చెన్నూర్ 16వ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేష్ తో పాటు చింతలగూడెం, కొత్తగూడెంల నుంచి వచ్చిన ఆయన అనుచరులకు బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.