పేద ప్రజలకు అండగా ప్రజా ప్రభుత్వం
13-08-2026 05:02 PM
60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కు అందించిన ఎమ్మెల్యే
ఉట్నూర్,(విజయక్రాంతి): సిరికొండ మండలం రిమ్మ గ్రామానికి చెందిన మార్సుకోల యాదవ్ రావ్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ యాదవ్ రావ్ కి అండగా ఉంటానని మాట ఇవ్వడంతో పాటు సీఎం సహాయనిది నుండి 60 వేల రూపాయల మంజూరు చేయించారు. చెక్కును గురువారం ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితుడికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వ నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో రిమ్మ మాజీ సర్పంచ్ పెందోర్ అనిల్,మెస్రం హనుమంతు, నగేష్ ఉన్నారు.






