13 August, 2026 | 7:19 PM

పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

13-08-2026 06:12 PM

వాంకిడి,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే ప్రకటించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల దశలవారీ పోరాటంలో భాగంగా గురువారం వాంకిడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ గడువు ముగిసి 36 నెలలు గడిచినా ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ నెల 21న జిల్లా కేంద్రంలో, 29న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో భారీ ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బండె హరీష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నాగరాజు, జిల్లా కార్యదర్శి బి.దుర్గయ్య, రాజలింగు, సాయికుమార్, మహేందర్, శ్రీనివాస్, సంతోష్, రాజమల్లు, అమ్జద్‌పాషా, స్వప్న, మమత, ఉప్రే వినేష్, రామారావు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.