13 August, 2026 | 7:23 PM

వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లు వెంటనే ఇవ్వాలి

13-08-2026 06:10 PM

బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి

హుజురాబాద్,(విజయక్రాంతి): వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవ కేంద్రాల సైట్‌లో వృద్ధాప్య, బీడీ కార్మికులకు ఆప్షన్ కనిపించడం లేదన్నారు. ఆగస్టు 15 నుంచి పెంచిన పెన్షన్లను అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులకు కూడా అందించాలని కోరారు. హామీలను అమలు చేసి అర్హులందరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ రెడ్డి డిమాండ్ చేశారు.