13 August, 2026 | 7:32 PM

పలిమెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దందెర రాజేందర్

13-08-2026 06:18 PM

పలిమెల,(విజయక్రాంతి): పలిమెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా దందెర రాజేందర్ నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన మండల అధ్యక్షుల జాబితాను ఈమేరకు విడుదల చేయగా రాజేందర్ పేరు వెలువడింది. నిస్వార్థ నాయకుడిగా ఎదిగిన రాజేందర్ కు మండల పార్టీ అధ్యక్ష పదవి రావటంతో కార్యకర్తలు, అభిమానులు ఆనందం వెల్లుబుచ్చుతున్నారు. తనపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షునిగా నియమించిన మంత్రి శ్రీధర్ బాబు, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.