ఎన్టీఆర్ నగర్‌లో ఎమ్మెల్యే పర్యటన
మంచినీరు, డ్రైనేజీ సమస్యలపై ఆరా
కుషాయిగూడ, జూన్ 16 (విజయక్రాంతి): హౌసింగ్ బోర్డ్ డివిజన్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మంగళవారం పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి కాలనీవాసులను కలుసుకుని తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కాలనీ అధ్యక్షుడు వాసు చారి, కార్యదర్శి మధు ముదిరాజ్, స్థానిక నాయకులు భానూరి రాకేష్, రిజ్వాన్, నరేష్, శ్రీకాంత్ గౌడ్, భీష్మాచారి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






