శిల్పకళా వేదికలో సాంస్కృతిక ప్రదర్శనలు
వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో సంగీత కచేరి, నృత్య ప్రదర్శన
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): గత రెండు రోజులుగా వేదం ఆర్ట్ ఆధ్వర్యం లో శిల్పకళా వేదికలో జరిగిన సంగీత కచేరీ, నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమెరికాలో విజయవంతమై న ప్రదర్శనల అనంతరం భారతదేశంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వేదం ఆర్ట్ రెండు రోజుల పాటు సంగీతం, సంస్కృతి, నృత్యాన్ని కలగలిపిన అద్భుత కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రము ఖ గాయని సునీత ఉపద్రష్ట టైంలెస్ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ప్రత్యేక ఆకర్షణగా మాయాబజార్ చిత్రంలోని చిరస్మరణీయ గీతాలను పునఃసృష్టించ గా, పాడుతా తీయగా చిన్నారులు వేదికపై రేలంగి సావిత్రి పాత్రలను ఆవిష్కరించడం ప్రేక్షకుల నుంచి ఘన స్పందన అందుకుంది. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళిగా ప్రత్యే క విభాగం నిర్వహించగా, ప్రేక్షకులు భావోద్వేగంతో స్పందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, సాహితి చాగంటి, ధనుంజయ్ తదితర గాయకులు కూడా సునీతతో కలిసి పా ల్గొన్నారు. పద్మభూషణ్ శోభన, ఎన్సెంబుల్ ప్రదర్శించిన ‘భావ్‘ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతం, భావ వ్యక్తీకరణ, విజువల్ ప్రెజెంటేషన్ల సమ్మేళనంగా రూపొందిన ఈ కార్యక్ర మం ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లిం ది. వేదం తరఫున నిఖిల్ పోలెపల్లి మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రేక్షకుల నుంచి వచ్చి న ప్రేమ, ఆదరణ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు రెండు గొప్ప కళాకారుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం మా కోసం గర్వకారణం అన్నారు.






