25-05-2025 06:56:09 PM
భద్రాచలం (విజయక్రాంతి): ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, కవిరత్న సురేష్ బాబును ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) ఆదివారం అభినందించారు. స్థానిక కేకే ఫంక్షన్ హాల్ నందు జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా అద్దంకి దయాకర్ వివిధ రంగాలలో పలు అవార్డులు సాధించడమేకాక, పదో తరగతి సైన్సు సబ్జెక్టులో నూరుశాతం ఫలితాలు సాధించి కవిరత్న జాతీయ పురష్కారం పొందినందుకు సురేష్ బాబును అభినందించారు. సదస్సులో సురేష్ బాబు చేసిన ప్రసంగం సభలో నవ్వులు కురిపించింది.