25-05-2025 07:28:52 PM
చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన నిర్వాహకులు..
చర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలో పిఎ అకాడమీ-హైద్రాబాద్ వారిచే 45 రోజులుగా నిర్వహించిన సమ్మర్ డ్యాన్స్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ డ్యాన్స్ క్యాంప్ కు చర్ల మండలంలోని చిన్నారులకు 45 రోజులు పూర్తయిన సందర్భంగా అకాడమీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమ్మర్ క్యాంపు నిర్వాహకులు నూప ప్రశాంత్ ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ ఇర్ప శ్రీను, మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ టీం ఛైర్మెన్ డాక్టర్ నీలి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి, బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు కుప్పాల సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలి ప్రకాష్ మాట్లాడుతూ... వేసవి సెలవుల్లో విద్యార్థులు డాన్స్ పట్ల ఆసక్తి కలిగి చక్కటి నృత్య ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను చూస్తుంటే ముచ్చట చేస్తుందని ఇటువంటి సమ్మర్ క్యాంపులను బాలబాలికలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.