కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
03-07-2024 01:34 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కవిత, మనీష్ సిసోడియా కస్టడీని జులై 25 వరకు కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో నేటీతో కవిత, సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. దీంతో కవిత, సిసోడియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు విచారణను జులై 25కు వాయిదా వేసింది.






