16 July, 2026 | 6:22 PM

విపక్షాల వాకౌట్‌పై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఫైర్

03-07-2024 01:24 PM

విపక్ష నేతలు సభను కాదు.. మర్యాద విడిచి వెళ్లారు

సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష నేతలు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మండిపడ్డారు. విపక్ష నేతలు సభను కాదు.. మర్యాద విడిచి బయటకు వెళ్లారని జగదీప్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు. విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అమమానించారని ఆరోపించారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పట్ల హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదని సూచించారు. రాజ్యంగం అనేది చేతిలో పుస్తకం కాదు.. జీవితానికి మార్గదర్శకం అన్నారు.  అటు రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయన్నారు. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించడంలేదన్నారు. ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదని, చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.