కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు
03-07-2024 01:42 PM
హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదని తేల్చిచెప్పారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్న హరీశ్ రావు ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.






