16 April, 2026 | 7:21 AM

కొండారెడ్డిపల్లిలో క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్సీ

02-02-2026 05:54 PM

షాద్ నగర్,(విజయక్రాంతి): కేశంపేట మండలంలో మండల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ సీసన్-1ను  ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడలతో మానసిక శారీరక, ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతుందని, క్రీడాకారులు  క్రమశిక్షణతో ఆడుతూ మండల లెవెల్ నుండి రాష్ట్ర, దేశ స్థాయి వరకు రాణించాలన్నారు. ఈ సందర్భంగా మండల్ లెవెల్ క్రీడాకారులకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో కొండారెడ్డిపల్లి  సర్పంచ్ పల్లె ఆనంద్, మాజీ సర్పంచ్  శేఖర్  తాండ్ర విష్ణు వర్ధన్ రెడ్డి, లింగం దన సర్పంచ్ నాగిళ్ల వెంకటేష్, పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి, తూర్పు గడ్డ తండా సర్పంచ్ తుకారాం, లేమామామిడి సర్పంచ్ సులోచన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జంగయ్య క్రీదాకారులు తదితరులు పాల్గొన్నారు.