18 May, 2026 | 5:56 PM

నిర్మల్ పోలీస్... మీ పోలీస్

18-05-2026 05:23 PM

మాక్ డ్రిల్‌ ప్రజలకు అవగాహన

నిర్మల్ మే 18 (విజయ క్రాంతి): నిర్మల్ గ్రామీణ ప్రాంతంలోని వైఎస్సార్ కాలనీలో ఈరోజు నిర్వహించిన SDRF మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఐఏఎస్, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో చేపట్టవలసిన సహాయక చర్యలు, రక్షణ విధానాలపై SDRF బృందాలు ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటనా ప్రదేశంలో ఏర్పాటు చేసిన CCC (Command & Control Center)తో అనుసంధానం చేసి, లైవ్ మానిటరింగ్ ద్వారా పరిస్థితులను పరిశీలించారు.మాక్ డ్రిల్ నిర్వహణ, సహాయక చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, అత్యవసర స్పందన వ్యవస్థలపై అధికారు సూచనలు చేశారు జిల్లా లోని పలు శాఖలు, జిల్లా ఉన్నతాధికారులు,SDRF బృందాలు,NCC విద్యార్థులు, వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.