18 May, 2026 | 5:57 PM

విద్యుత్ తీగల రాపిడికి చెలరేగిన నిప్పురవ్వలు.. స్పందించిన సిబ్బంది

18-05-2026 05:27 PM

బోథ్(విజయక్రాంతి):  మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఉన్న మర్రిచెట్టు కొమ్మలు తగిలి రాపిడికి గురి కావడంతో నిప్పురవ్వలు లేచాయి. దీంతో స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్తు తీగలు రాపిడికి గురికాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. త్వరలోనే చెట్టు కొమ్మలను తొలగించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు.