30 August, 2026 | 4:31 PM

మొద్దులగూడెంలో మంచినీటి కోసం రా'స్తా రోకో

30-08-2026 03:22 PM

దమ్మపేట, ఆగష్టు 30(విజయ క్రాంతి): మండల పరిధిలోని మొద్దులు గూడెం హరిజనవాడకు చెందిన ప్రజలు మంచినీటి కోసం  మొద్దులు గూడెం ప్రదాన రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు,  పురుషులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో కు సంఘీభావం గా సిపిఎం పార్టీ దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడిశ్రీనివాసరావు, సిపిఎం పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొద్దులు గూడెంలో  దళిత పేటలోని గ్రామపంచాయతీ  మోటారు చెడిపోయి 30 రోజులు కావస్తుందని, రోజూ కూలి మీద జీవితం గడిపే  200 కుటుంబాలకు మంచి నీళ్ళు రావటం లేదని, యుద్ద ప్రాతిపదికన  జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్రొత్త గా బోరు వేయించి,  కొత్త కరెంట్ మోటార్ బిగించి మంచినీరు అందించాలని కోరారు. ఫలిత వాడలో మంచినీటికి పరిష్కారం చూపని యెడల మండల అభివృద్ధి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో దళితపేటలోని ప్రజలు. మిగతా గ్రామ ప్రజలు ఎం సీతయ్య, ‌ ఎం మల్లేశ్వర రావు, కె రాములు తదితరులు పాల్గొన్నారు.