5 September, 2026 | 8:25 AM

రైతు కూలీ సంఘం మహాసభలను విజయవంతం చేయాలి

30-08-2026 | 03:23pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ రత్నం పోషన్న పిలుపునిచ్చారు. శనివారం జానకపూర్‌లో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కానాజీ వీరన్న, బాబా, అబ్దుల్లా, బండారి తిరుపతి, జగజంపుల తిరుపతి, సమీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు