16 April, 2026 | 3:48 PM

బంగ్లా సంక్షోభంపై మోదీ, బైడెన్ చర్చ

27-08-2024 01:39 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత, ఉక్రెయిన్ లో తన పర్యటన అంశాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సోమవారం చర్చించారు. ఇరు దేశాధినేతలు ఈ మేరకు ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో చర్చల ద్వారా శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నామని భారత స్థిరమైన వైఖరిని పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ.. ఆ దేశంలో శాంతిభద్రతల పునరుద్ధరణ, మైనారిటీలు ముఖ్యంగా హిందువుల భద్ర త అంశంపై ఇరువురు చర్చించారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని సమీక్షించారు. భార త్, అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాల పౌరులతో పాటు మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.