మోదీ స్టాక్స్ డీ రేటింగ్!
ముంబై, జూన్ 4: తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో భారత స్టాక్ మార్కెట్‌తో పాటు మోదీ స్టాక్స్‌గా పేరొందిన పీఎస్‌యూలు, క్యాపిటల్ గూడ్స్ షేర్ల డీ రేటింగ్ జరుగుతుందని ఎమ్కే గ్లోబల్ అధికారి శేషాద్రిసేన్ అంచనా వేశారు. మరోవైపు విని యోగ రంగాలైన ఎఫ్‌ఎంసీజీ, రిటైలర్లు మంచి పనితీరును కనపరుస్తాయని, హెల్త్‌కేర్ రంగం పట్ల కూడా తాము పాజిటివ్‌గా ఉన్నామని చెప్పారు. రిస్క్ ఎక్కువగా ఉన్నందున భారత్ మార్కెట్ స్వల్పకాలంలోనే డీ రేటింగ్ జరుగుతుందని చెప్పారు. పీఎస్ యూ షేర్లు, క్యాపిటల్ గూడ్స్ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీవైపు మళ్ళాలని సూచించారు. తాజాగా 6% పతనం తర్వాత నిఫ్టీ ఇండెక్స్ 19.5 రెట్లు పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్)పై ట్రేడవుతున్నదని, నిఫ్టీ మరో 10 శాతం పతనమై 20,000 పాయింట్లలోపునకు తగ్గకపోతే, 18 పీఈపై మార్కెట్ పెట్టుబడులకు ఆకర్షణీయం అవుతుందన్న అభిప్రాయాన్ని సేన్ వ్యక్తం చేశారు.
ఇన్వెస్టర్లకు ప్రతికూలమే యూబీఎస్ వ్యాఖ్యలు
నరేంద్ర మోదీ తిరిగి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టినా, బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కనందున, ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ప్రతికూలమేనని అంతర్జాతీయ బ్రోకరేజ్ యూబీఎస్ వ్యాఖ్యానించింది. సాధారణ కార్పొరేట్ లాభాలతో పోలిస్తే భారత్ మార్కెట్ విలువ కూడా అత్యంత ఖరీదుగా ఉన్నదని, పటిష్ఠమైన ప్రభుత్వం ఇవ్వగల రాజకీయ స్థిరత్వాన్ని, విధాన కొనసాగింపు ఇప్పుడు ప్రశ్నార్థకమైనందున ఈ విలువ వద్ద మార్కెట్ నిలవలేదని వివరించింది. వర్థమాన మార్కెట్లలో భారత్‌పై తాము అండర్‌వెయిట్‌గా ఉంటామని తెలిపింది. తయారీ రంగ ప్రోత్సాహకాలైన పీఎల్‌ఐ వంటి స్కీములు కొనసాగవచ్చని, ఆగ్రి/ఫుడ్ సబ్సిడీ సంస్కరణలు, భూ సంస్కరణలు, ప్రత్యక్ష పన్ను సంస్కరణలు మూలనపడతాయని యూబీఎస్ అనలిస్ట్‌లు అంచనా వేశారు.






