రూపాయి విలువకు చిల్లు
05-06-2024 12:46 AM
ముంబై, జూన్ 4: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంతో స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రతిబింబిస్తూ రూపాయి విలువ భారీగా తగ్గింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ ఏకంగా 45 పైసలు క్షీణించి,83.59 వద్ద ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్ నుంచి భారీ నిధుల్ని వెనక్కు తీసుకున్న కారణంగా రూపాయి పడిపోయిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. ఎఫ్‌పీఐలు రూ.12,436 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడించాయి.






