11 June, 2026 | 1:24 AM

ప్రజాసేవలో నిమగ్నమైన మోదీ

11-06-2026 12:00 AM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్‌కుమార్

ముషీరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): భారతదేశ ఔన్నత్యాన్ని, మాతృభూమిపై గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపి, వికసిత్ భారత్ రూపకల్పనలో విశ్వగురుగా నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో దేశ ప్రజలకు12 సంవత్సరాల సుదీర్ఘ పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులు చిక్కడపల్లి వివేక్ నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ దేశ అభివృద్ధి, నిర్విరామంగా ప్రజాసేవలో నిమగ్నమై అత్యున్నత స్థానంలో 12 వసంతాలు పూర్తి చేసుకున్న ‘ప్రధాని  నరేంద్ర మోదీ‘ అభినందనలు తెలియజేస్తూ అయన కు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, శ్రీరామరక్షతో దేశ సేవలో మోదీ నాయకత్వం బలమైన ఆత్మవిశ్వాసంతో  వికసిత భరత్ నిర్మాణానికి నిరంతరం స్పూర్తినిస్తుందన్నారు.

మునుముందు కూడా మోదీ ప్రధానిగా దేశానికి సేవలందించాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, వీఎస్టీ రాజు, శివకుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, రవీందర్ శ్రీనివాస్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.