17 May, 2026 | 5:44 PM

మూడోసారి ప్రధానిగా మోదీ పక్కా

23-04-2024 12:16 AM

l కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

రంగారెడ్డి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సోమవారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేదన్నారు. పదేండ్లలో ప్రధాని మోదీ అనుసరించిన దూరదృష్టి విధానాల వల్లనే దేశంలో పేదరికం తగ్గిందని చెప్పారు. 2030నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నదని ఆశాబావం వ్యక్తం చేశారు.