17 May, 2026 | 4:55 PM

మహిళపై దాడి.. నిందితుడు అరెస్ట్

17-05-2026 04:14 PM

బోధన్,(విజయక్రాంతి)నవీపేట్ మండలంలోని ధర్మారంలో దండ్ల కిష్టవ్వపై రెండు రోజుల క్రితం జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన సూరా అలియాస్ ఎత్తరి సాయి కుమార్ డబ్బుల వివాదంతో మహిళపై కర్రతో దాడి చేసి పరారయ్యాడు. అదివారం రోజున మధ్యాహ్నం  పోలీసులు నిందితుడిని పట్టుకొని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండు కు పంపినట్లు నవిపేట్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.