17 May, 2026 | 5:15 PM

విద్యార్థికి అభినందన

17-05-2026 04:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని ముజిగి గ్రామానికి చెందిన వైష్ణవి పదవ తరగతిలో 600 మార్కులకు గాను 570 మార్కులు సాధించగా మాజీ మంత్రి సన్మానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయిలో మార్కులు సాధించిన విద్యార్థికి అభినందించి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.