17 May, 2026 | 4:41 PM

భారీ మెజార్టీతో గెలుస్తా : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

23-04-2024 12:17 AM

పార్లమెంట్ ఎన్నికల్లో 3లక్షలకు పైగా మెజార్టీ ఓట్లు సాధిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ పరిధిలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన వెంటనే చేవెళ్ల పార్లమెంట్‌కు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి చేవెళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమదేవీ, మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు.