భారత ఆర్థిక వ్యవస్థ పితామహుడు మోడీ..
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినుకొండ నాగేశ్వర్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): భారత ఆర్థిక వ్యవస్థ పితామహుడు మోడీ అని బిజెపి రాష్ట్ర ఆరోగ్య సభ్యులు వినుకొండ నాగేశ్వర్ రెడ్డి(BJP state health member Vinukonda Nageshwar Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడ శిశుమందిర్‌లో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బూత్ అధ్యక్షులు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి మోడీ భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండగా ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని అన్నారు.
సూపరిపాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశ గౌరవం పెరిగిందని అన్నారు. ప్రపంచం మోడీ వైపు చూస్తుందన్నారు. కార్యకర్తలు మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలనే లక్ష్యంతో శ్రమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నేతలు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, రావుల వేణు తదితరులు పాల్గొన్నారు.






