27 June, 2026 | 6:52 PM

ఇది దళిత జాతి విజయం..

10-06-2025 05:27 PM

తిప్పారపు సంపత్..

హుజురాబాద్ (విజయక్రాంతి): సైదాపూర్ ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, అజయ్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం దళితుల న్యాయ విజయంగా నిలిచిందని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్(TPCC SC Department Atrocities State In-charge Thipparapu Sampath) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బత్తుల మహేందర్‌పై పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని, రాజ్యాంగమే దళితులకు రక్షకంగా నిలుస్తుందని తెలిపారు.

బాధితులైన మహేందర్, శంకరమ్మలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వారికేదైనా జరిగితే ఎస్సై భార్గవ్ బాధ్యత వహించాలన్నారు. భార్గవ్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రుద్రారపు రామచంద్రం మాదిగ, న్యాయవాది జీడి రవితేజ, తునికి వసంత్ మాదిగ, చల్లూరి రాహుల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.