calender_icon.png 28 January, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ కుటుంబాన్ని అవమానించడమే మోదీ పని

28-01-2026 12:52:26 AM

  1. ప్రధాన ప్రతిపక్షాన్ని గౌరవించే  సంప్రదాయాన్ని చెడగొట్టొద్దు 
  2. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  

హైదరాబాద్, జనవరి 27 (విజయ క్రాంతి) : గాంధీ కుటుంబాన్ని అవమానించ డమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారని, బీజేపీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ వాజ్ పాయి.. అద్వానీ లాంటి వాళ్లను ప్రతిపక్ష నాయకుడిగా ఇందిరాగాంధీ గౌరవించారని, కానీ మోదీ ప్రతిపక్ష నాయ కుడు రాహుల్ గాంధీని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని అవమానించాలనే గణతంత్ర వేడుకల్లో మూడో వరుసలో కూర్చోబెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి సంప్రదాయాలను అందిస్తే.. ధర్మం పాటిస్తామని చెప్పుకునే బీజేపీ మాత్రం మంచి సంప్రదాయాలను తుంగలో తొక్కుందని జగ్గారెడ్డి దుయ్యబ ట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత  నెహ్రూ, ఇందిరా గాంధీ,  రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు సంప్రదాయా లు పాటించారని, ప్రధాని జెండా ఎగరేస్తే.. ప్రతిపక్ష నాయకు డు ముందు వరుసలో కూర్చోబెట్టేవారని, .

అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన హక్కు అని ఆయ న పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సింహం లాంటి వాడు. ప్రియాంక గాంధీ చిరుతపులి లాంటి నాయ కురాలు అని అన్నారు.  ప్రియాం క గాంధీ పార్లమెంట్‌లో మోదీని పులి లెక్క వెంటా డిందన్నారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడం మాను కోవాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి హితవు పలికారు.