calender_icon.png 28 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ ’ఎట్ హోమ్’ వేడుకలో త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరి

28-01-2026 12:51:11 AM

విద్యా రంగంలో త్రివేణికి దక్కిన అరుదైన గౌరవం

రఘనాథపాలెం /ఖమ్మం, జనవరి 27 (విజయక్రాంతి): విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న త్రివేణి విద్యా సంస్థలకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు లోక్ భవన్లో నిర్వహించిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ’ఎట్ హోమ్’ (At Home) కార్యక్రమానికి త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

సోమవారం సాయంత్రం లోక్ భవన్ లాన్స్లో జరిగిన ఈ విశిష్ట వేడుకలో డాక్టర్ వీరేంద్ర చౌదరి గారు పాల్గొని, గవర్నర్ గారి ఆత్మీయ విందులో భాగమయ్యారు. రాష్ట్ర ప్రథమ పౌరుడి సమక్షంలో, పలువురు ప్రముఖులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం త్రివేణి విద్యా సంస్థల నిరంతర కృషికి మరియు విద్యా ప్రస్థానానికి దక్కిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు మాట్లాడుతూ.. ‘గౌరవనీయ గవర్నర్ గారి నుండి ఈ ఆహ్వానం అందుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.

ఇది త్రివేణి కుటుంబ సభ్యులందరి సమిష్టి కృషికి దక్కిన ఫలితం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఇటువంటి అపురూపమైన ఘట్టాలు ఎంతో స్ఫూర్తినిస్తాయి‘ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల త్రివేణి విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.