మోదీ యూరప్ పర్యటన షురూ
- యూరప్‌లోని ఆరు దేశాల్లో పర్యటన
- జీ7 సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల తరఫున గళం
న్యూఢిల్లీ, జూన్ ౧౩: ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ ఆరు రోజుల కీలక దౌత్య పర్యటన నిమిత్తం శనివారం యూరప్ బయల్దేరివెళ్లారు. జూన్ 13 నుంచి 18 వరకు ఈ పర్య టన కొనసాగనుంది. తొలుత ఫ్రాన్స్ చేరుకున్నారు. ఆ దేశ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. అలాగే, ఆదివారం నైస్ నగరంలో ‘భారత్ ఇనొవేట్స్’ సదస్సులో భాగస్వామి కానున్నారు. ఇదే రోజు సాయంత్రం బ్రాటిస్లావా చేరుకుంటారు.
1993లో స్లోవేకియా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక పర్యటనలో స్లో వేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో మోదీ చర్చలు జరు పుతారు. ఆటోమొబైల్ తయారీ, రైల్వే మౌ లిక సదుపాయాలు, పారిశ్రామిక సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం పెంపుపై దృష్టి సారిస్తారు. సోమవారం తిరిగి ఫ్రాన్స్‌కు వెళ్తారు. అక్కడ రెండు రోజుల పాటు జరుగనున్న 52వ జీ7 సదస్సులో పాల్గొంటారు. జీ౭ సదస్సుకు వరుసగా ఎనిమిదో సారి హాజరవుతున్న భారత ప్రధాని మోదీ కావ డం విశేషం. అలాగే, మోదీ ఇదే వేదికలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.
17వ తేదీన వీరిద్దరూ సమావేశమవుతారని అమెరికన్ మీడియాలో కథ నాలు ప్రసారమయ్యాయి. ఇరు దేశాధినేత లు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వీరి భేటీ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో వీరిద్దరూ చివరిసారి భేటీ అ య్యారు భారత్ జీ7లో సభ్యదేశం కాకున్నప్పటికీ, ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని సదస్సుకు హాజరు కావడం విశేషం






