14 June, 2026 | 3:00 AM

డీఆర్డీవో మరో ఘనత

14-06-2026 01:10 AM
  1. బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
  2. ఒడిశా చాందీపూర్ వేదికగా ప్రయోగం విజయవంతం
  3. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం

న్యూఢిల్లీ, జూన్ 13: ఐదువందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే క్షిపణులను కూల్చి వేసే బహుళ అంచెల బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ (యాంటీ షిప్ వార్‌ఫేర్ టెక్నాలజీ)పరీక్షలో డీఆర్డీడీవో విజయం సాధించింది. జూన్ 10, 11 తేదీలలో వరుసగా ఈ వ్యవస్థ కు సంబంధించిన మూడు ప్రయోగాలు ఒడిశాలోని చాందీపూర్ నుంచి నిర్వహించారు. దూరం నుంచి శత్రుదేశాల ముప్పును ఎదుర్కొనే వ్యవస్థను రూపొందించారు.

డీఆర్డీడీ వో ప్రయోగం పట్ల కేంద్ర రక్షణ శాఖ మం త్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖండాంతర క్షిప ణుల ముప్పులను ఎదుర్కొనేలా ఆధునాతన సాంకేతికతతో క్షిపణి వ్యవస్థను డీఆర్డీ వో రూపొందించింది. అదనంగా, మధ్య శ్రేణి నావికా నౌకా విధ్వంసక క్షిపణిని కూడా పరీక్షించారు. భారతదేశపు సముద్ర దాడు లు, రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది కూడా ఒక ప్రధాన విజయంగా నిపుణులు పరిగణిస్తున్నారు.

ఈ తరహా క్షిపణి వ్యవస్థ అభివృద్ధితో ప్రపంచంలోనే భారత్ ఐదో స్థానానికి చేరింది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, చైనాల వద్దే ఈ క్షిపణి వ్యవస్థ ఉంది. డీఆర్డీడీవో పరీక్ష విజయవంతంతో ఇప్పుడు భారత్ సొంతమైనట్లయింది. ఖండాతర బాలిస్టిక్ క్షిపణి అనేది అత్యంత సుదూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న కిపణి. 5,500 కి.మీ. పైగా దూరం నుంచి ఒక ఖండం నుంచి మరో ఖండానికి చేరే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అణ్వాయుధాలను సైతం మోసుకెళుతుంది.

రాకెట్‌లా గా అంతరిక్షంలోకి దూసుకువెళ్లి అక్కడి నుంచి భూమికి తిరిగి వచ్చి లక్ష్యాలను చేధిస్తుంది. ఈ కారణంగానే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాలు, సాంకేతికతలో ఒకటిగా నిలుస్తుంది. శత్రువుల బాలిస్టిక్ క్షిపణులు చేరకముందే వాటి లక్ష్యాలను అడ్డగించడం, రాడార్లను గు ర్తించడం, ముప్పును అంచనా వేయడం, ఆ తరువాత గాలిలోనే దాన్ని ధ్వంసం చేస్తుంది. తొలిసారి విఫలమైతే రెండోసారిలో లక్ష్యాన్ని మరింత ఖచ్చితత్వంతో మట్టుబెడుతుంది.