15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మోదీ పాలన ప్రపంచానికే ఆదర్శం

07-06-2025 12:42 AM

మండల బీజేపీ అధ్యక్షుడు కుంట రామ్‌రెడ్డి

సదాశివనగర్, జూన్ 6 (విజయక్రాంతి):కేంద్రంలో నరేంద్రమోదీ  ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా శాఖ పిలుపు మేరకు 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం - సంకల్ప సహకారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ సదాశివనగర్  మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి  ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడే రవీందర్ రావు  మాట్లాడుతూ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్  మన బలగాల శౌర్య పరాక్రమాలను ప్రశంసిస్తూ 11 ఏళ్ల మోడీ పరిపాలన విజయాలపై ప్రధానమంత్రి ఎలాంటి అవినీతికి తాగు లేకుండా,ఒక్కరోజు సెలవు తీసుకోకుండా,నిరంతరం పనిచేస్తున్న నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ప్రపంచం మేచ్చేలా ఆదర్శ వంతమైన పాలన కొనసాగిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

అదే విధంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి దగ్గర చెట్లు నాటడం జరిగింది  కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట రాంరెడ్డి, మండల ప్రధాన కార్య దర్శిలు అమృత భూంరావు, చక్రధర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ సాయిలు, ఎస్టి మోర్చా అధ్యక్షులు చందర్ నాయక్,మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్,సాగర్, గంగాధర్  కార్యదర్శులు గంగాధర్, శక్తి కేంద్రం ఇంచార్జిలు సత్యం, వెంకటేశం, బూత్ అధ్యక్షులు, మరియు వివిధ పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.