ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా వైస్ చైర్మన్‌గా మొహలే దత్త
25-05-2026 09:58 PM
జైనూర్,(విజయక్రాంతి): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ-ఎన్‌జీవో) కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైస్ చైర్మన్‌గా జైనూర్‌కు చెందిన దళిత రత్న అవార్డు గ్రహీత మొహలే దత్తను నియమించినట్లు జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు. సోమవారం జైనూర్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో దత్తకు నియామక పత్రం అందజేశారు. ఆయన స్వచ్ఛంద సేవలను గుర్తించి జిల్లా కమిటీలో అవకాశం కల్పించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా రాథోడ్ రమేష్ మాట్లాడుతూ.. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా జిల్లా ప్రజలకు సేవలు అందించాలని, అవినీతి, అక్రమాలు, అన్యాయాలను అరికట్టి న్యాయం వైపు నిలబడాలని సూచించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.






