24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

మరింత దిగిన బంగారం

15-12-2024 12:00 AM

తులం ధర మరో రూ.980 తగ్గుదల

హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రపంచ మార్కెట్లో వరుస రెండు రోజుల్లో పుత్తడి ధర పతనంకావడంతో  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్ ధర గురువారం 40 డాలర్లు, శుక్రవారం రాత్రి మరో 30 డాలర్లు పడిపోయింది దీనితో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ.980 క్షీణించి రూ. 77,980 వద్ద ముగిసింది.

ఇది రెండు రోజుల్లో రూ.1,580 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.900 దిగి రూ.71,400 వద్ద నిలిచింది. యూఎస్ ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా వెలువడినందున, బంగారం ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ధర క్షీణించిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు. 

మరో రూ.1,000 తగ్గిన వెండి

బంగారం బాటలోనే మరో విలువైన లోహం వెండి ధర సైతం క్షీణించింది. శుక్రవారం రూ.3,000 తగ్గిన కేజీ వెండి ధర శనివారం మరో రూ.1,000 తగ్గి రూ.1,00,000 వద్ద నిలిచింది.