15 July, 2026 | 6:00 AM

ఇక వరుస అప్‌డేట్స్

08-12-2024 12:00 AM

టాలీవుడ్ హీరోల్లో అడవి శేష్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. అడవి శేష్ కథానాయకుడిగా నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు అడవి శేష్ పెట్టింది పేరు. వాస్తవానికి ఆయనదొక సెపరేట్ ట్రాక్. అందుకే ఆయన సినిమా ఏదైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. అంచనాలకు తీసిపోకుండా చిత్రాన్ని అడవి శేష్ ప్రజెంట్ చేస్తారు. ప్రస్తుతం అడవి శేష్.. ‘డెకాయిట్’, ‘గూఢచారి 2’ చిత్రాలు చేస్తున్నారు. అడవి శేష్ వెండితెరపై కనిపించక చాలా నెలలవుతోంది. అందుకే ఆయన చిత్రాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కనీసం అప్‌డేట్స్ అయినా విడుదల చేస్తారంటే అవి కూడా వదలడం లేదు. ఈ క్రమంలోనే డిసెంబర్‌లో వరుస అప్‌డేట్స్ వదలబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ ప్రకటించారు. డిసెంబర్‌లో ‘డెకాయిట్’ నుంచి.. జనవరిలో ‘గూఢచారి 2’ నుంచి సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ రూపొందు తోంది. ‘గూఢచారి 2’ చిత్రాన్ని వినయ్ కు మార్ రూపొందిస్తున్నారు.