15 July, 2026 | 5:53 AM

ఇదొక మంచి కథ

07-12-2024 10:35 PM

అమిత్ రావ్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్’. ఈ చిత్రాన్ని సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి పోషిస్తున్నారు. ఈ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్త సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా.. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..- సస్పెన్ హారర్ థ్రిల్లర్ జానర్స్‌కు పోటీ తక్కువగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉంటే ఈ సినిమాలతో సులువుగా ప్రేక్షకులకు రీచ్ కావొచ్చు.

అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఈ మూవీలో ఉందని నమ్ముతున్నా’’ అన్నారు. నిర్మాత నిఖిల్ ఎమ్ గౌడ మాట్లాడుతూ.. జిన్ సినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నాం. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. డైరెక్టర్ చిన్మయ్ రామ్ మాట్లాడుతూ.. జిన్ సినిమా డైరెక్టర్‌గా నాకు ఫస్ట్ మూవీ. నా స్నేహితుడు పర్వీజ్ తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేశాను. ఇదొక మంచి కథ’’ అని పేర్కొన్నారు. హీరో అమిత్ రావ్ మాట్లాడుతూ.. జిన్ సినిమా స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మంచి విజువల్స్ తో సినిమా చేయబోతున్నాం. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోగా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు.