calender_icon.png 14 October, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

14-10-2025 08:47:50 AM

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station) పరిధిలోని పద్మారావు నగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల ఇద్దరు కవల పిల్లలను గొంతునులిమి చంపి తల్లి తల్లి సాయి లక్ష్మీ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. చిన్నారులు కవల పిల్లలు కార్తికేయ, లాస్యత వల్లిగా గుర్తించారు. సాయిలక్ష్మి స్వగ్రామం కృష్ణా జిల్లా నూజివీడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు. దంపతుల మధ్య గొడవలే ఆత్మహత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.