14-10-2025 01:30:29 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలిరోజే 10 నామినేషన్లు దాఖలయ్యాయి. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 21 వరకు అభ్యర్థుల నుంచి నామినేష న్లు స్వీకరించనున్నారు. 22న స్క్రూటినీ, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ చేయనున్నారు.
సెలవు రోజులు మినహా మిగిలిన పని దినాల్లో నా మినేషన్ల స్వీకరణ ఉంటుంది. కార్యాలయంలో నేరుగా లేదా డిజిటల్ విధానంలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. కాగా తొలి రోజే 10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్లు చేసిన వారిలో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు ఉండగా, 8 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.
తెలంగాణ పునర్‌నిర్మాణ సమితి తరఫున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్‌రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమాన్, వేము ల విక్రమ్‌రెడ్డి, ఇబ్రహీంఖాన్‌తో పాటు మ రో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.
ట్రిపుల్ ఆర్ రైతుల నామినేషన్లు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పోటు ఉండేలా కనిపిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) బాధితులు భారీగా నా మినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 300 మంది వరకు నామినేషన్లు వేసి, సర్కార్‌కు నిరసన తెలపాలనే అభిప్రాయంతో ఉన్నారు. పెద్దోళ్లకు అనుకూలంగా ట్రిపుల్ ఆర్ ఆలైన్‌మెంట్లు మార్చడం, పేదలకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాం డ్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ వర్గీకకరణను నిరసిస్తూ మాల సామాజిక వర్గానికి చెందిన నాయకులు దాదాపు 200 మంది నామినేషన్లు వేయనున్నట్లు మందాల భాస్కర్ తెలిపారు.