17 March, 2026 | 9:55 AM

వాహనదారులు హెల్మెట్ ధరించాలి

17-03-2026 01:21 AM
  1. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత  
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 
  3. సొంత డబ్బులతో 300 మందికి హెల్మెట్లు పంపిణీ చేసిన వీహెచ్

హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి) : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించుకుని, తమ ప్రాణాలను రక్షించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరా వు సూచించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వీహెచ్ అన్నారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యా లయ క్యాంపస్ చౌరస్తా వద్ద 300 మంది ద్విచక్ర వాహనదారులకు తన సొంత డబ్బులతో ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీహెచ్  మాట్లాడుతూ  యువత రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతారోహిత్ ముదిరాజ్, పీసీసీ లింగ్విస్టిక్ మైనార్టీ చైర్మన్ రాజేష్ అగర్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శిలు నాగభూషణం, ఆర్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, నారాయణస్వామి, గరిగంటీ శ్రీదేవి రమేష్, పులి జగన, లక్పతి యాదగిరిగౌడ్ , కాంగ్రెస్ నాయకులు ఈడెల్లి ప్రభాకర్, షేక్ జమీర్, శ్రీధర్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్ , కోటం అనిల్ , రావుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.