4 June, 2026 | 1:18 AM

మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్డ్ ప్రారంభం

04-06-2026 12:00 AM

భారతదేశపు తొలి ఆధార్ ధృవీకరణ రివ్యూ ఎకో సిస్టం

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): సినిమా సమీక్షల రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయతను తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్డ్ (ఎంఆర్‌ఓ) వ్బుసైట్, మొబై ల్ యాప్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్, మిల్లెట్ న్యూస్ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం ఈ వేదికను ప్రారంభించారు. నకిలీ రివ్యూలు, అనామక రేటింగ్స్, ఉద్దేశపూర్వకంగా ప్రభావితం చేసే అభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో, నిజమైన వ్యక్తుల నుంచి వచ్చే అభిప్రాయాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఎంఆర్‌ఓ ను రూపొందించారు.

ఎంఆర్‌ఓలోని ప్రధాన ప్రత్యేకత ఆధార్ ఆధారిత రివ్యూయర్ ధృవీకరణ వ్యవస్థ. రివ్యూయర్గా నమోదు కావాల నుకునే వ్యక్తులు ముందుగా డిజిలాకర్ ద్వారా ఆధార్ ఓటీపీ ఆధారిత గుర్తింపు ధృవీకరణ ను పూర్తి చేయాలి. అనంతరం ఎంఆర్‌ఓ అడ్మినిస్ట్రేషన్ బృందం ఆమోదించిన తర్వాత మాత్రమే రివ్యూలు పోస్ట్ చేసే అవకాశం ఉం టుంది. నకిలీ అకౌంట్లు, డూప్లికేట్ ప్రొఫైల్స్ ను అరికట్టేందుకు ఒక వ్యక్తి  ఒక ధృవీకరించిన ప్రొఫైల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు అనేక వేదికల్లో వేలాది రేటింగ్స్  చూస్తున్నారు. అయితే ఆ రేటింగ్స్  ఎవరు రాశారు, అవి నిజమైన అభిప్రాయాలా కాదా అనే విషయంలో జవాబుదారీతనం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితికి పరిష్కారంగా పారదర్శకమైన, ధృవీకరించిన మూవీ రివ్యూ వ్యవస్థను రూపొందిం చాలనే లక్ష్యంతో ఎంఆర్‌ఓను తీసుకొచ్చాం అని అన్నారు. 

ఎంఆర్‌ఓలో ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా, డిజిటల్ మీడియా వేదికలు, ప్రముఖ మూవీ రివ్యూ వ్బుసైట్లు, ధృవీకరించిన యూట్యూబ్ రివ్యూయర్లు, అలాగే ప్రజల రివ్యూలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 20 ప్రత్యేక పబ్లిక్ రివ్యూయర్ కేటగిరీలను ఎంఆర్‌ఓ రూపొందించింది. రైతులు, వైద్యు లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జర్నలిస్టు లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలు, ఇన్ఫ్లూయెన్సర్లు తదితర వర్గాలకు చెందిన వ్యక్తులు తమ అభిప్రాయాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 

ప్రతి కేటగిరీకి 100 మంది చొప్పున మొత్తం 2,000 మంది ధృవీకరించిన పబ్లిక్ రివ్యూయర్ల నెట్వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్బుసైట్: www.Movie Reviews.online, యాప్ ప్లే స్టోర్‌లో Movie Reviews MRO అని సెర్చ్ చెయ్యాలి.