4 June, 2026 | 1:20 AM

కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం

04-06-2026 12:00 AM

బేగంబజార్ డివిజన్ అధ్యక్షుడిగా రాకేష్ యాదవ్ 

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బేగం బజార్ డివిజన్ కాంగ్రెస్ నూతన అధ్యక్షునిగా తోట రాకేష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ రాకేష్‌ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా రాకే ష్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత 15 సంవత్సరాలుగా విద్యార్థి విభాగం, యువజన విభాగం, ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం పని చేశానని గుర్తు చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మోహిత రోహిత్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.